లైవ్ అప్ డేట్స్ IND vs SL : భారత్ బ్యాటింగ్

లైవ్ అప్ డేట్స్ IND vs SL : భారత్ బ్యాటింగ్

వాంఖడే స్టేడియం వేదికగా టీమిండియా జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ తో టీమిండియా తరుపున  గిల్, శివమ్ మావీ టీ20 ల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కెప్టెన్‌గా హార్దిక్‌కు ఇదే తొలి సిరీస్‌ కావడం విశేషం. 

శుభ్‌మాన్ భారత్ తరుపున టెస్టులు, వన్డేలు ఆడాడు.  కానీ మావికి ఇది భారత జెర్సీని ధరించడం ఇదే మొదటిసారి. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ తరుపున ఆడారు. 

శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కుశాల్‌ మెండిస్, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, డాసున్ శనక (కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, మహీశ్‌ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మదుషంక

భారత్ : ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్‌ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్‌ పటేల్, శివమ్‌ మావి, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్