V6 News

శ్రీరామపునర్వసు దీక్షల విరమణ 

శ్రీరామపునర్వసు దీక్షల విరమణ 

భద్రాచలం,వెలుగు:  శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం భద్రాచలంలో శ్రీరామ పునర్వసు దీక్షల విరమణ గురువారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దీక్షాపరులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకున్నారు.  ఏఈవో శ్రావణ్‌‌‌‌కుమార్‌‌‌‌ ఆధ్వర్యంలో భక్తులంతా తిరువడిని శిరస్సుపై ధరించి, రామపాదుకలతో భద్రగిరి ప్రదక్షిణ చేశారు.

ముందుగా రెండు సార్లు భద్రగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి, మూడోసారి పట్టణంలో శోభాయాత్రగా సాగించారు.  అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య తిరువడిని స్వామికి సమర్పించి మాల విరమించారు. ఈ సందర్భంగా దీక్షాపరులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.   రాత్రి దీక్షాపరుల కోసం రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాలతో రామనామం ఆలయ పరిసరాల్లో మారుమ్రోగింది.