పఠాన్ పాటకు ప్రొఫెసర్లు డ్యాన్స్.. షారూఖ్ ఫిదా

పఠాన్ పాటకు ప్రొఫెసర్లు డ్యాన్స్.. షారూఖ్ ఫిదా

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ ఫీవర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. షారూఖ్ కెరీలోనే బిగ్గెస్ట్ హిట్‭గా నిలిచిన పఠాన్.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఈ మూవీలోని జూమే జో పఠాన్ సాంగ్‭కు ఓ కల్చరల్ ప్రోగ్రాంలో.. విద్యార్థులతో కలిసి లేడీ ప్రొఫెసర్లు డ్యాన్స్ చేసిన వీడియోను కింగ్ ఖాన్ తన ఇన్‭స్టాగ్రామ్‭లో షేర్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన జేఎమ్ కాలేజ్ కామర్స్ ఫ్రొపెసర్లు విద్యార్థులతో కలిసి ఈ పాటకు స్టెప్పులేశారు. విద్యార్థులతో సరదాగా చేసిన వీరి డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రొఫెసర్ల వీడియోను షేర్ చేసిన షారూఖ్.. మనకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ.. మనతో సరదాగా గడిపే టీచర్లు, ప్రొఫెసర్లు ఉండటం చాలా లక్కీ.. వాళ్లంతా ఎడ్యుకేషనల్ రాక్ స్టార్స్ అంటూ కామెంట్ పెట్టాడు. జనవరి 26న రిలీజైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లు వసూలు చేసింది.