దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు విరామం ఇచ్చిన రాజమౌళి యూరప్ పర్యటనలో ఉన్నారు. జూన్ 27న ఫ్రాన్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘RRR’ ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మాస్టర్‌క్లాస్‌లో పాల్గొన్న రాజమౌళి.. ‘వారణాసి’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమా ఫ్రాంచైజీగా కాకుండా కేవలం ఒకే భాగంగా రూపొందుతున్న స్టాండ్అలోన్ చిత్రమని స్పష్టం చేశారు. అలాగే కథలోని మెయిన్ థీమ్ యొక్క భావోద్వేగాన్ని కూడా ఫస్ట్ టైం జక్కన్న రివీల్ చేసి అంచనాలు పెంచారు.
సినిమా కథాంశంపై మాట్లాడిన జక్కన్న "అంటార్కిటికా మంచు ప్రాంతాల చలి, రామాయణంలోని దేవతలు, ప్రకృతి విపత్తులు, అద్భుతమైన ఫాంటసీ అంశాలను ప్రేక్షకులు అనుభవించబోతున్నారు. కానీ ఈ అద్భుతమైన విజువల్ ప్రపంచం మధ్యలో ఉన్న అసలు భావోద్వేగం మాత్రం తండ్రీకొడుకుల మధ్య ఉన్న బంధమే. అదే 'వారణాసి' కథకు మూలం" అని చెప్పారు. ఇంకేం ఉంది.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ పిచ్చా క్యూరియాసిటీతో ఉన్నారు.
ఫ్రాన్స్‌లో ప్రదర్శించిన 'వారణాసి' గ్లింప్స్‌కు అక్కడి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. థియేటర్ అంతా కేరింతలు, విజిల్స్‌తో మార్మోగింది. ఈ సందర్భంగా రాజమౌళి మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. సినిమాలోని ఒక కీలక సన్నివేశంలో మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారని, ఆ షాట్ కు థియేటర్లు షేక్ అవ్వడం కన్ఫామ్ అని చెప్పుకొచ్చారు. .
Rajamouli about what to expect in #Varanasi:
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) June 27, 2026
• You are going to experience the wilderness of Africa.
• you're going to experience the cold and ice of Antarctica.
• you're going to experience the gods of Ramayana in that.
• You're going to experience the national disasters… pic.twitter.com/jrumLtFRA5
ఇటీవలే వారణాసి రైటర్, జక్కన్న ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ 30 నిమిషాల ప్రత్యేక సన్నివేశాన్ని వివరిస్తూ.. "ఇది శ్రీరాముడు మరియు కుంభకర్ణుడి మధ్య జరిగే యుద్ధం. ట్రైలర్లో మీరు చూసిన హనుమంతుడి తోకపై ఉన్న రథం, ఆ యుద్ధ సన్నివేశాలకు సంబంధించినదే" అని వివరించి మరింత ఆసక్తి క్రియేట్ చేశారు.
భారీ అంచనాలతో..
గతేడాది నవంబర్‌లో రామోజీ ఫిలిం సిటీలో 50 వేల మంది అభిమానుల సమక్షంలో ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతంతో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహేష్ బాబు ఈ సినిమా కోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. పొడవాటి జుట్టు, గడ్డంతో ఆయన కనిపిస్తున్న తీరు చూస్తుంటే, రాజమౌళి మరో చరిత్రను సృష్టించడానికి సిద్ధమయ్యారని అర్థమవుతోంది. ‘వారణాసి’ కేవలం సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమా గర్వించదగ్గ మరో మైలురాయి కాబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
