బన్ని డెడికేషన్, డైరెక్టర్ పై అతనికున్న నమ్మకానికి హ్యాట్సాఫ్

బన్ని డెడికేషన్, డైరెక్టర్ పై అతనికున్న నమ్మకానికి హ్యాట్సాఫ్

టాలీవుడ్ కు అల్లు అర్జున్ ఒక గిప్ట్ అని అన్నారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. హైదరాబాద్ లో జరిగిన పుష్ప ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన రాజమౌళి.. ‘ఒక విధంగా ఇవాళ నాకు బాధగా ఉంది..ఆనందంగా ఉంది. సుకుమార్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. పుష్ప సినిమా కోసం సుక్కు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు. బాంబేలో పుష్ఫ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బన్ని బాంబేలో సినిమా ప్రమోషన్ చేయాలి. బన్ని డెడికేషన్, డైరెక్టర్ పై అతనికున్న నమ్మకానికి హ్యాట్సాఫ్. నువ్వు ఇండస్ట్రీకి గిఫ్ట్. నిన్ను చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందుతారు. డిసెంబర్ 17న డైరెక్ట్ గా థియేటర్లలో చూడాలి’ అని అన్నారు రాజమౌళి.