అస్సాంలో సీజేపీ నేతల అరెస్ట్ తో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఓ సమావేశంలో పాల్గొనేందుకు గౌహతికి వెళ్తున్న CJP వాలంటీర్లను పోలీసులు అడ్డుకున్నారు. సీజేపీ కో కన్వీనర్ అశుతోష్ రంకాతో సహా 30 మంది కార్యకర్తలను అరెస్ట్ చేయడంతో గౌహతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
గౌహతిలో జరగాల్సిన సీజేపీ సమావేశానికి వెళ్తుండగా అశుతోష్ రంకాను అస్సాం పోలీసులు నిర్భంధించారని సీజేపీ ఆరోపిస్తుంది. అరెస్ట్ చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే డిమాండ్ చేశారు. అస్సాంలో పాఠశాలలు, భూమి, వరదలు, ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తకుండా తమ టీంను అడ్డుకునేందుకు అస్సాం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రంకా ఆరోపించారు. అరెస్టయిన వారిలో రంకాతో పాటు నాగాలాండ్ కు చెందిన కార్యకర్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
