హైదరాబాద్, వెలుగు: ఎస్టీ గురుకులాల్లోని సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్)లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సీట్ల భర్తీకి నిర్వహించిన సీవోఈ సెట్ 2026 ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలు బుధవారం రిలీజ్ అయ్యాయి. ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అడ్మిట్ కార్డులను గురుకుల అధికారిక వెబ్ సైట్ లో చూడాలని సెక్రటరీ సీతాలక్ష్మి సూచించారు. సీట్లు వచ్చిన స్టూడెంట్స్ ఈ నెల 21లోగా సంబంధిత ప్రిన్సిపాల్స్ దగ్గర రిపోర్ట్ చేయాలన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 17 సీవోఈల్లో 500 సీట్లు ఉండగా వీటికి 8900 మంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు.
