తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలుపు తిరుగుతున్నాయి. విజయ్ ను సీఎం చేయకుండా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. తమ రాజకీయ అనుభవం మొత్తాన్ని ఉపయోగిస్తున్నాయి. విజయ్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. విజయ్ ను అధికారంలోకి తీసుకురాకుండా వ్యూహాలు రచిస్తున్నాయి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు.
ఈ క్రమంలోనే పాండిచ్చేరిలోని రిసార్ట్ లో ఉన్న 28 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. చెన్నై సిటీకి వస్తున్నారు. ఇప్పటికే ఆ 28 మంది ఎమ్మెల్యేలు రిసార్ట్ నుంచి బయలుదేరినట్లు వార్తలు వస్తున్నాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అనూహ్యంగా చెన్నై సిటీకి వస్తుండటంపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదే సమయంలో డీఎంకే చీఫ్, మాజీ సీఎం స్టాలిన్ డీఎంకే సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ భేటీకి పార్టీకి చెందిన అడ్వకేట్లు హాజరుకావటం ఆసక్తి రేపుతోంది. ఈ మీటింగ్ లో డీఎంకే పార్టీ కీలక నేతలు రాజా, ఇళంగో, విల్సన్, బాలు, నెహ్రలతోపాటు ఇతర నేతలు హాజరయ్యారు. అదే విధంగా డ్రవిడర్ కజగం నాయకుడు కె.వీరమణితోనూ సమావేశం కావటం ఊహించని పరిణామంగా చెబుతున్నారు నేతలు. స్టాలిన్ అత్య
అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఆసక్తిగా ఉంటే డీఎంకే మద్దతు ఇవ్వొచ్చా లేదా అనే అంశం చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అన్నాడీఎంకే పార్టీ నుంచి మాజీ సీఎం పళనిస్వామి సీఎం అవుతారని.. డీఎంకే పార్టీ మద్దతు ఇస్తుందనే ప్రచారం తమిళనాట జోరుగా చర్చ నడుస్తుంది. ఇందులో భాగంగానే డీఎంకే పార్టీ పొత్తులో సీపీఎం, సీపీఐ, ముస్లిం లీగ్, డీఎండీకే వంటి పార్టీలు.. ఇప్పటికీ విజయ్ కు మద్దతు ఇవ్వలేదని తెలుస్తోంది.
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ఆ వెంటనే 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయటానికి రెడీగా ఉండాలనే సంకేతాలు విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సీపీఎం, సీపీఐ, ముస్లిం లీగ్ పార్టీలు మద్దతు ఇవ్వకుండా.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ఆ తర్వాత పరిణామాలపై సీనియర్ నేతలు, లాయర్లతో చర్చిస్తున్నారు విజయ్.
