నిర్మాతకు సమంత స్ట్రాంగ్​ కౌంటర్​

నిర్మాతకు సమంత స్ట్రాంగ్​ కౌంటర్​

టాలీవుడ్​ హీరోయిన్​ సమంత కెరీర్​ ముగిసిందంటూ నిర్మాత చిట్టిబాబు ఇటీవల కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్లలో ఆమె కావాలనే సానుభూతి సంపాదించుకునేందుకు ట్రై చేస్తుందన్నాడు. ఈ డ్రామాలు అన్నిసార్లు పనిచేయవంటూ వ్యాఖ్యలు చేశాడు. జీవనోపాధి కోసమే ‘పుష్ప’లో ఐటెంసాంగ్ చేసిందన్నాడు. శకుంతల పాత్రకు సమంతను తీసుకోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శించాడు.

అతడి వ్యాఖ్యలపై తాజాగా సామ్​ పరోక్షంగా స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చింది. ‘చెవిలో వెంట్రుకలు ఎలా పెరుగుతాయి?’ అని గూగుల్​లో సెర్చ్​ చేస్తే వచ్చిన సమాధానాన్ని తన ఇన్​స్టాగ్రామ్​లో ఉంచింది. టెస్టోస్టిరాన్​ అధికమవ్వడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారనే అర్థం వచ్చేలా ఆ నిర్మాతను ఉద్దేశించి ఓ స్క్రీన్​షాట్​ను షేర్​ చేసింది.