సర్కారులో సమాచార శాఖే కీలకం

సర్కారులో సమాచార శాఖే కీలకం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కీంలను ప్రజల వద్దకు తీసుకుపోవడంలో సమాచార శాఖ అధికారులదే కీలక పాత్ర అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ జడ్పీ ఆఫీస్ లో ఐ అండ్ పీఆర్ రిటైర్డ్ అధికారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో శాఖలు ఉన్నప్పటికీ సమాచార శాఖకు ప్రత్యేక స్థానం ఉందని, ప్రతీ శాఖ అధికారులు ఈ శాఖతో విధిగా సంబంధం కలిగి ఉంటారన్నారు.

రిటైర్డ్ అధికారులు రోల్ మోడల్​గా ఉంటూ సలహాలు, సూచనలివ్వాలని కోరారు. విశేషానుభవం కలిగిన రిటైర్డ్ అధికారులు మార్గ దర్శకులుగా ఉండాలని ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ రాజమౌళి కోరారు. రిటైర్మెంట్ అనేది సహజమని ప్రముఖ సైకాలజిస్ట్ పట్టాభిరామ్ అన్నారు.