V6 News

ప్రైవేటు ఏజెన్సీకి కార్డుల కాంట్రాక్ట్‌ ఇచ్చిన రాష్ట్ర సర్కార్

ప్రైవేటు ఏజెన్సీకి కార్డుల కాంట్రాక్ట్‌ ఇచ్చిన రాష్ట్ర సర్కార్
  •     లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్న ఏజెన్సీ ప్రతినిధులు
  • ఆయుష్మాన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్
  •     ప్రైవేటు ఏజెన్సీకి కార్డుల కాంట్రాక్ట్‌ అప్పగించిన రాష్ట్ర సర్కార్ 

హైదరాబాదు, వెలుగు:  ఆయుష్మాన్ భారత్ కార్డుల జారీకి ఎట్టకేలకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్డుల జారీ కోసం జిల్లాలు, గ్రామాల వారీగా లబ్ధిదారుల నుంచి కేవైసీ వివరాలను సేకరించడం కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీ‌కి కాంట్రాక్ట్ అప్పగించింది. ఆ ఏజెన్సీ ప్రతినిధులు ఊర్లలోకి వెళ్లి లబ్ధిదారుల నుంచి ఆధార్‌‌, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు సేకరించడం ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ స్కీములను కలిపి అమayuలు చేస్తున్నారు. ఆయుష్మాన్ కార్డులు ఇవ్వకుండా, ఆరోగ్యశ్రీ కార్డులతోనే ఆయుష్మాన్ లబ్ధిదారులకు కూడా ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల కుటుంబాలు ఆయుష్మాన్ స్కీమ్‌ పరిధిలో ఉన్నాయి. ఆయుష్మాన్ కార్డులు లేకపోవడం వల్ల, మన రాష్ట్రానికి చెందిన వలస కూలీలు ఇతర రాష్ట్రాల్లో ఆయుష్మాన్‌ కింద చికిత్స పొందలేకపోతున్నారు‌. ఇప్పుడు కార్డుల జారీతో వలస కూలీలకు ఊరట లభించనుంది. ఇన్నాళ్లు కార్డుల జారీకి మొండికేసిన రాష్ట్ర సర్కార్, కేంద్రం నిధులు ఆపేస్తామని హెచ్చరించడంతో ఎట్టకేలకు దిగొచ్చింది.