తెలంగాణలో గ్రూప్ 1 నియమాకాలపై స్టే కంటిన్యూ

తెలంగాణలో గ్రూప్ 1 నియమాకాలపై స్టే కంటిన్యూ

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 నియమాకాలపై స్టే కొనసాగుతోంది. 2025, జూన్ 11 వరకు గ్రూప్ 1 నియమాకాలపై స్టే కొనసాగిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు పొడగించింది. కాగా, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై ఇవాళ (మే 2) కోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలను న్యాయస్థానం విన్నది. 

ఆర్గ్యుమెంట్స్ పూర్తి కాకపోవడంతో కేసు తదుపరి విచారణను జూన్ 11కు వాయిదా వేసింది. అప్పటి వరకు (జూన్ 11) వరకు గ్రూప్ 1 నియమాకాలపై స్టే కొనసాగుతోందని తెలిపింది. వెకేషన్ లోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని టీజీపీఎస్సీ కోరగా.. వేలాది మంది అభ్యర్థులకు సంబంధించిన విషయం కాబట్టి.. వేగంగా విచారణ ముగించాలని ఒత్తిడి చేయొద్దని టీజీపీఎస్సీకి సూచించింది. 

►ALSO READ | తెలంగాణ తొలి విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న