వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయం వల్ల కనీసం రెండు నెలలు ఆటకు దూరంగా ఉండనున్నాడు. ఈ గాయం వల్లే ఇండియాతో ఇటీవల జరిగిన సెకండ్ టెస్ట్‌లో కేన్ బరిలోకి దిగలేదు. ఇప్పుడు గాయం తీవ్రత పెరగడంతో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో కివీస్ జట్టు ఆడబోయే సిరీస్‌లకు కూడా దూరమయ్యాడు. కేన్‌కు ఎనిమిది, తొమ్మిది వారాలు విశ్రాంతి అవసరమని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ చెప్పారు. ప్రస్తుతానికి సర్జరీ చేయించాల్సిన అవసరం కనిపించడం లేదన్నారు.

