వ్యాయామం కోసం.. ఉదయాన్నే ఉత్సాహం కోసం.. ఫిట్ నెస్ కోసం జిమ్ కు వెళుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్.. కసరత్తులతోపాటు బాడీ షేమింగ్ కోసం స్టెరాయిడ్స్ కూడా అమ్ముతున్నారు కొందరు జిమ్ నిర్వాహకులు. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన కలకలం రేపుతోంది. జిమ్ చేస్తున్న యువతీ యువకులే లక్ష్యంగా.. ఈ స్టెరాయిడ్ ఇంజక్షన్స్ అమ్ముతున్నారు నిర్వాహకులు. సిక్స్ ప్యాక్ బాడీ కోసం వీటిని ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు పోలీసులు.
హైదరాబాద్ సిటీలోని పలు జిమ్స్ లో పోలీసులు తనిఖీ చేయగా ఈ బాగోతం బట్టబయలు అయ్యింది. ఓల్డ్ సిటీ ప్రాంతంలోని ఓ జిమ్ పై దాడి చేసిన పోలీసులు.. 180 స్టెరాయిడ్ ఇంజక్షన్స్, ఒక వెయ్యి 100 మాత్రులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో ఓం ప్రకాష్, సరోదే నరేష్, సయ్యద్ ఫరూక్ ఉన్నారు. వీరిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.
ఇప్పటి వరకు ఎంత మందికి స్టెరాయిడ్ ఇంజక్షన్స్ అమ్మారు.. ఎంత మంది వాటిని తీసుకున్నారు అనే విషయాలను రాబడుతున్నారు. ఏయే పరిస్థితుల్లో వాళ్లకు అమ్ముతున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ సమయంలో ఈ స్టెరాయిడ్ ఇంజక్షన్స్ ప్రభావం ఎలా ఉంటుంది.. వీటని తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి.. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అనే వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు.
