V6 News

లగ్జరీ కార్లలో తిరుగుతూ డ్రగ్స్ దందా

లగ్జరీ కార్లలో తిరుగుతూ డ్రగ్స్ దందా
  • ఇద్దరు నిందితులు అరెస్ట్, ఎండీఎంఏ స్వాధీనం

చందానగర్, వెలుగు: లగ్జరీ కార్లలో తిరుగుతూ డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్​కు చెందిన సాయి వికాస్, భరత్ చౌదరి కలిసి విజయవాడకు చెందిన మురారీ అనే వ్యక్తి నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ద్వారా ఎండీఎంఏ తెప్పిస్తున్నారు. వీటిని నగరంలోని అవసరమున్న వారికి గ్రాముకు రూ. 5 వేల చొప్పున విక్రయిస్తున్నారు.

శుక్రవారం తెల్లవారుజామున కొండాపూర్ మాధవ హిల్స్ వద్ద రైడ్ చేసిన పోలీసులు.. వీరి నుంచి 6.09 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. గత ఆరు నెలలుగా ఈ దందా సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చర్యల కోసం కొండాపూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ప్రధాన సరఫరాదారు మురారీతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.