అమెరికాలో నల్లజాతీయులపై వివక్ష కొనసాగుతోంది

అమెరికాలో నల్లజాతీయులపై వివక్ష కొనసాగుతోంది
  • కరోనాను ఎదుర్కోవటంలో ట్రంప్ విఫలమయ్యారు
  • యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా విమర్శలు

వాషింగ్టన్ : అమెరికాలో ఇంకా నల్లజాతీయులపై తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంలో ఇది మరింత ఎక్కువైందని చెప్పారు. హిస్టారికల్లీ బ్లాక్ కాలేజేస్ అండ్ యూనివర్సిటీస్ (హెచ్ బీ సీ యూ ఎస్) లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆన్ లైన్ ద్వారా పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా నల్ల జాతీయులపై కొనసాగుతున్న వివక్షను ప్రస్తావించారు. ” నిజాయితీగా చెప్పాలంటే కరోనా కారణంగా నల్లజాతీయులపై అంతర్గతంగా ఉన్న వివక్ష, అసమానతలు స్పష్టంగా బయటపడుతున్నాయి. దీనిపై నల్ల జాతీయులు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ” అని ఒబామా కామెంట్ చేశారు. కరోనా సమయంలో బయటకు వెళ్తున్న నల్లజాతీయులు హత్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జార్జియాలో నల్ల జాతీయుడైన అహ్మద్ అర్బారీ అనే ఓ అధికారి హత్యకు గురైన విషయాన్ని ప్రస్తావించారు. ఇక కరోనాను ఎదుర్కొవటంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా విఫలమైందని ఒబామా ఆరోపించారు. ఇంతటి సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు కనీసం తమ విధులు నిర్వహిస్తున్నట్లు కూడా నటించటం లేదని విమర్శించారు.