CSK vs LSG: చెన్నైకు స్టోయినీస్ చెక్.. ఒక్క మ్యాచ్‌తో మూడు రికార్డ్స్ బ్రేక్

CSK vs LSG: చెన్నైకు స్టోయినీస్ చెక్.. ఒక్క మ్యాచ్‌తో మూడు రికార్డ్స్ బ్రేక్

చెపాక్ స్టేడియం అంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తిరుగుండదు. సొంతగడ్డపై ప్రత్యర్థులపై దారుణంగా విరుచుకుపడతారు. అయితే ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు మార్కస్ స్టోయినీస్ చెన్నైకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ అజేయ సెంచరీ చేశాడు. చెపాక్ లో మంగళవారం (ఏప్రిల్ 24) జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌‌లో మార్కస్ స్టోయినిస్ (63 బాల్స్‌‌లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 124 నాటౌట్‌‌) ఖతర్నాక్ సెంచరీతో లక్నోకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. స్టోయినిస్ ధాటికి ఈ మ్యాచ్ లో ఏకంగా మూడు రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. 

ఐపీఎల్ చరిత్రలోనే సక్సెస్ ఫుల్ ఛేజింగ్ లో స్టోయినీస్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డ్ పాల్ వాల్తాటీ పేరిట ఉంది. వాల్తాటి చెన్నై సూపర్ కింగ్స్ పై 120 పరుగులు చేసి పంజాబ్ జట్టుకు విజయాన్ని అందించాడు. చెపాక్ లో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన జట్టుగా లక్నో రికార్డ్ సృష్టించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ను వరుసగా రెండు సార్లు ఓడించిన తొలి జట్టుగా నిలిచి స్పెషల్ రికార్డ్ తమ ఖాతాలో వేసుకుంది. ఇలా ఒక్క మ్యాచ్ లో ఇప్పటివరకు సాధ్యం కానీ మూడు రికార్డ్స్ బ్రేక్ అవ్వడం విశేషం. అంతేకాదు ఈ సీజన్ లో చెన్నై సొంతగడ్డపై ఓటమి రుచి చూపించిన జట్టు కూడా లక్నో సూపర్ జయింట్స్ కావడం విశేషం. 

Also Read:టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో అషి, స్వప్నిల్‌‌‌‌

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత సీఎస్కే 20 ఓవర్లలో 210/4  స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 నాటౌట్) సెంచరీ, శివం దూబే (27 బాల్స్‌‌లో 3 ఫోర్లు,7 సిక్సర్లతో 66) ఫిఫ్టీతో  భారీ స్కోరు అందించారు. ఛేజింగ్‌‌లో లక్నో   19.3 ఓవర్లలో 213/4  స్కోరు చేసి గెలిచింది.మార్కస్ స్టోయినిస్ (63 బాల్స్‌‌లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 124 నాటౌట్‌‌) అజేయ సెంచరీతో చెలరేగాడు. నికోలస్ పూరన్ (15 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34) రాణించాడు. స్టోయినిస్‌‌కు ప్లేయర్ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది.