కుక్కల దాడిలో 20 మేకలు మృతి

కుక్కల దాడిలో 20 మేకలు మృతి

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెన్గెస్పూర్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వీధి కుక్కల దాడిలో 20 మేక పిల్లలు మృత్యువాత పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు వెళితే తాండూరు మండలం చెన్గెస్పూర్ గ్రామానికి చెందిన కురువ శివరాజ్ బతుకుదెరువు నిమిత్తం మేకలను కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మేకలను తీసుకొని అడవికి వెళ్లగా, మేక పిల్లలను ఇంటి దగ్గరే చిన్న గుడారంలో వదిలిపెట్టి వెళ్లాడు. ఎవరు లేని సమయంలో గ్రామంలోని కుక్కలు మేక పిల్లలపై తీవ్రంగా దాడి చేయడంతో 20 మేక పిల్లలు మృత్యువాత పడ్డాయి. 

అడవి నుండి మేకలను తీసుకొని ఇంటికి వచ్చిన శివరాజ్ కుక్కల దాడిలో చనిపోయిన మేక పిల్లలను చూస్తూ లబోదిబో మన్నారు. అప్పులు చేసి మరి కొనుక్కున్న మేకపిల్లలు మృత్యువాత పడటంతో ఆర్థికంగా తీవ్ర నష్టం ఏర్పడినట్లు ఈ సందర్భంగా కురువ శివరాజ్ తెలిపారు. ఈరోజు మేక పిల్లలపై కుక్కలు దాడి చేయగా.. రేపు పసి పిల్లలపై దాడి చేస్తే బాధ్యులు ఎవరు అంటూ గ్రామస్థులు అధికారులపై మండిపడ్డారు.