14 రోజుల ముందు నోటీసిచ్చాకే సమ్మె

14 రోజుల ముందు నోటీసిచ్చాకే సమ్మె

న్యూఢిల్లీ: సమస్యల పరిష్కారానికో.. డిమాం డ్ల సాధనకో ఉద్యోగులు సమ్మె చేయాలనుకుంటే కనీసం 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని ప్రభుత్వం కొత్త రూల్​ తీసుకురానుంది. ఈమేరకు నోటీసును తప్పనిసరి చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్​ కుమార్​ గంగ్వార్​బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. ఇప్పుడున్న 44 కార్మిక చట్టాలను సవరించి, కొత్తగా నాలుగు కోడ్స్​గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఈ సవరణలలో 14 రోజుల నోటీసు విషయాన్నీ పొందుపరచనున్నట్లు చెప్పారు. దీనిపై సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ మంత్రి గంగ్వార్​ సభ్యులను కోరారు. మరోవైపు, 2016లో నిర్వహించిన సర్వే ప్రకారం.. దేశంలో మొత్తం 10 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని మంత్రి చెప్పారు.

మరిన్ని వార్తల కోసం