స్కూల్ ముందు అనుమానస్పదంగా విద్యార్థిని మృతి

స్కూల్ ముందు అనుమానస్పదంగా విద్యార్థిని మృతి

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో న్యూ మిలీనియం స్కూల్ ముందు అఖిల పేరెంట్స్ ఆందోళన కొనసాగిస్తున్నారు. న్యూ మిలీనియం హాస్టల్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న అఖిల నిన్న(ఆదివారం) అనుమానాస్పద స్థితిలో  చనిపోయింది. ఆరోగ్యం బాగోక పోవడంతో చనిపోయిందని స్కూల్ యాజమాన్యం తెలిపింది. అయితే తమ బిడ్డ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అఖిల పేరెంట్స్. తమ బిడ్డ మృతిపై సమాధానం చెప్పాలని స్కూల్ ముందు టెంట్ వేసుకొని నిన్నటి నుంచి నిరసన కొనసాగిస్తున్నారు విద్యార్థిని తల్లిదండ్రులు. స్కూల్ యజమాని టీఆర్ఎస్ నేత అని అఖిల తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ బిడ్డ మృతి గురించి అడిగితే స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు విద్యార్థిని అఖిల డెడ్ బాడీ ఇంకా హుజూరాబాద్ లోనే ఉంది.  అఖిల కాలిపై గాయాలు ఉన్నాయని చెబుతున్నారు అఖిల పేరెంట్స్.