కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు

కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు

నీట్ పరీక్ష అవకతవకల క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ఐక్య యువజన(NSUI,SFI,AISF,PDSU,PYL,TJS) విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. ఎన్ఎస్ యుఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన నివాసం దగ్గర భారీగా మోహరించిన పోలీసులు భారీ కేడ్లు పెట్టి  వారిని అడ్డుకున్నారు. 

ఈ క్రమంలో విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య జరిగిన వాగ్వివాదంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాన్ ఎక్కించి కాచిగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకలపై NTA నీ రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థి నాయకులు రాష్ట్రంలోని పలువురు బీజేపీ ఎంపీల ఇళ్లను ముట్టడిస్తానమని హెచ్చరించారు. దీంతో బీజేపీ ఎంపీల నివాసాల దగ్గర పోలీసులు మోహరించారు.