టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు ఎగ్జామ్స్

టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు ఎగ్జామ్స్

ప్రస్తుతం పది, ఇంటర్మీడియేట్ విద్యార్థులు  సంవత్సరం మొత్తం చదివి అకాడమిక్ ఇయర్ చివర్లో వార్షిక పరీక్షలు రాస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు సార్లు ఎగ్జామ్స్ రాసే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. చదువుల పేరుతో పిల్లలపై భారాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 లో భాగంగా విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ ఆ అకాడమిక్ ఇయర్ లో రెండు సార్లు నిర్వహించి, వన్  ఆఫ్ ది బెస్ట్ అంటే ఆ రెండిట్లో ఏది ఎక్కువ మార్కులు వస్తే అది పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. 

ఈ ఛాన్స్ కేవలం సిబిఎస్సీ విధానంలో పది, ఇంటర్మిడియేట్ చదివే స్టూడెంట్స్ వర్తిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లో ప్రైమ్‌ మినిస్టర్‌ స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే ప్రతి యేట 10రోజులు నో బ్యాగ్ డే.. స్కూల్ బ్యాగ్ లేకుండా పిల్లలు పాఠశాలకు హాజరైయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2025, 26 విద్యాసంవత్సరానికి ఈ నిర్ణయాలు అమలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.

Also Read :కృష్ణా కొత్త ట్రిబ్యునల్ పై సుప్రీంలో ఏపీ పిటిషన్