2023 బ్యాచ్ ఐఏఎస్లకు సబ్ కలెక్టర్ పోస్టింగ్లు

2023 బ్యాచ్ ఐఏఎస్లకు సబ్ కలెక్టర్ పోస్టింగ్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 2023 బ్యాచ్ కు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

 ఈ నియామకాల ప్రకారం.. నారాయణఖేడ్ కలెక్టర్‌‌గా ఉమాహారతి, భైంసా సబ్ కలెక్టర్‌‌గా సంకేత్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్‌‌గా అభిజ్ఞన్ మాల్వియా నియమితులయ్యారు. కల్లూరు సబ్ కలెక్టర్‌‌గా అజయ్ యాదవ్, భద్రాచలం సబ్ కలెక్టర్‌‌గా మృణాల్ శ్రేష్ఠ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌‌గా మనోజ్ఞను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.