ప్యాన్​ ఇండియా మూవీలో చాన్స్​

ప్యాన్​ ఇండియా మూవీలో చాన్స్​

బిగ్​బాస్​ సీజన్​ 7లో అందం అమాయకత్వంతో ఆడియెన్స్​ను ఆకట్టుకుంది శుభ శ్రీ రాయగురు. ఈ షో నుంచి ఈ బ్యూటీ అనూహ్యంగా ఎలిమినేట్​ ఐన సంగతి తెలిసిందే.  మరోసారి రీ ఎంట్రీ ఇస్తుందని ఆమె  ఫ్యాన్స్​ ఆశపడినా అది జరగలేదు. బిగ్​బాస్​ ఉల్టా పుల్టా గేమ్​తో వారి ఆశలకు గండిపడింది.  ఈ నటి పెట్టిన తాజా పోస్ట్​ చూసిన వారంతా తను హౌస్​లోకి వెళ్లకపోవడమే మంచిదైందని సంబరపడుతున్నారు. ఎందుకంటే ఈ గ్యాప్​లో ఓ ప్యాన్​ ఇండియా మూవీలో ఈ ముద్దుగుమ్మ చాన్స్​ కొట్టేసింది. సుజీత్​ దర్శకత్వంలో పవన్​ కల్యాణ్​ హీరోగా వస్తున్న ‘ఓజీ’లో శుభశ్రీ నటిస్తోంది. ఈ విషయాన్ని నెట్టింట పోస్ట్​ చేసి షాకిచ్చింది. తనపై విశ్వాసం ఉంచిన సుజీత్​కు థ్యాంక్స్​ చెప్తూ అతడితో ఉన్న ఫొటోను పోస్ట్​ చేయడంతో వైరల్​గా మారింది.