"ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" రిలీజ్ డేట్

 "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" రిలీజ్ డేట్

మోహ‌న కృష్ణ ఇంద్ర‌గంటి డైరెక్షన్ లో  సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్ బాబు సరసన అందాల బామ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ రిలీజ్ డేట్‌కు ముహుర్తం ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 16న రిలీజ్ చేయనున్నట్లు ఇవాళ అనౌన్స్ చేశారు. ఫస్ట్ నుంచి ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయని టాక్. అంతేకాకుండా సుధీర్‌బాబు, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబోలో తెర‌కెక్కుతున్న మూడో మూవీ కావ‌డంతో ఎక్స్ పెక్టేషన్స్ పెంచుకున్నారు.

గ‌తంలో వీళ్ల కాంబోలో వ‌చ్చిన ‘స‌మ్మోహ‌నం’, ‘వి’ చిత్రాలు ప్రేక్ష‌కుల మెప్పు పొందాయి. ఈ సినిమాలోరాహుల్ రామ‌కృష్ణ కీల‌క‌పాత్ర పోషిస్తున్నాడు. బెంచ్‌మార్క్ స్టూడీయోస్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్‌, టీజ‌ర్‌లు గ‌మ‌నిస్తే ఈ మూవీలో సుధీర్ ద‌ర్శ‌కుడిగా నటించిన‌ట్లు క‌న్ఫార్మ్ అయింది. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుందంటున్నారు ఫ్యాన్స్.