సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌‌‌‌గా కాలింగ్ సహస్ర

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌‌‌‌గా కాలింగ్ సహస్ర

టీవీ షోలతో ఫేమ్ తెచ్చుకుని హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. తను నటిస్తున్న చిత్రాల్లో ‘కాలింగ్ సహస్ర’ ఒకటి. అరుణ్ విక్కిరాలా ద‌‌ర్శక‌‌త్వంలో విజేష్ త‌‌యాల్‌‌, చిరంజీవి ప‌‌మిడి, వెంక‌‌టేశ్వర్లు క‌‌టూరి నిర్మిస్తున్నారు. డాలీషా హీరోయిన్‌‌. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, నవంబర్‌‌‌‌లో రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘అవుట్‌‌పుట్ చాలా బాగా వచ్చింది.  ఇందులో సరికొత్త సుధీర్‌‌‌‌ను చూస్తారు. ఇలాంటి పాత్రలో కూడా న‌‌టిస్తారా అనేంత వైల్డ్‌‌గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌తో మాసీగా సినిమా ఉంటుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌‌‌‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’ అని చెప్పారు. మార్క్ కె రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.