
మళ్లీ మొదలైంది సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతగా ఆకట్టుకోలేకపోయాడు అక్కినేని హీరో సుమంత్ . ప్రస్తుతం ప్రశాంత్ సాగర్ దర్శకత్వంలో ‘అహం రీబూట్’ అనే ఓ సినిమాని చేస్తున్నాడు. వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిట్చ్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ ఫస్ట్ గ్లిట్చ్ లో సుమంత్ ఆర్జే నిలయ్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ అమ్మాయి కిడ్నాప్ అవ్వడం, ఒక డార్క్ రూమ్ లో తనను బంధించి ఉంచారని చెప్పడం, ఆ అమ్మాయిని ఆర్జే నిలయ్ ఎలా కాపాడాడు? అన్నది ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఒక్కరకంగా చెప్పాలంటే ఫస్ట్ గ్లిట్చ్ మొత్తం సినిమా పైన అంచానాలను పెంచేసింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.