ఒక్కో నిమ్మకాయ 10 రూపాయలా.. వారంలోనే 350 శాతం పెరిగిన ధర

ఒక్కో నిమ్మకాయ 10 రూపాయలా.. వారంలోనే 350 శాతం పెరిగిన ధర

వేసవి కాలం మొదలయ్యింది. ఉదయం నుంచే మండే ఎండలు.. భగ భగ మండే సూరీడు. ఇక వేసవి తాపాన్ని తగ్గించేందుకు జనం రక రకాల పానీయాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అందులో నిమ్మరసం ఒకటి. ఈ సమయంలో నిమ్మకాయల డిమాండ్‌ అమాంతంగా పెరిగిపోయింది. మండే ఎండలా నిమ్మ ధర భగభగ మండుతోంది. కొనుగోలు చేయాలంటేనే జనం వామ్మో నిమ్మకాయా ధర ఏంటి ఇంతనా అంటున్నారు. ఒక మోస్తరు సైజు  నిమ్మకాయ ధర రూ. 5 లకు హోల్​ సేల్​ మార్కెట్లోనే విక్రయిస్తున్నారు.  గతంలో  పెద్ద సైజు నిమ్మకాయలు  రూ. 20కి 6 వచ్చేవి అంటే 10 మూడు వస్తాయి. కానీ ఇప్పుడు  చిన్న  నిమ్మకాయ ధర ఒకటి  రూ.5  కావడంతో వామ్మో ఇదేంటి  అంటూ ఆశ్చర్యపోతున్నారు. వేసవి కాలంలో నిమ్మకాయలకు డిమాండ్‌ పెరగడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు లబోదిబో మంటున్నారు. ఇది నిమ్మకాయ లేక బంగారమా అంటున్నారు.

సమ్మర్​ హీట్​ పెరిగేకొద్ది నిమ్మకాయ రేటు పెరుగుతోంది.  గతంలో లెమన్​ సోడా.. లెమన్​ కూల్​ డ్రింక్​  రూ. 20 కి విక్రయించేవారు.  నిమ్మకాయలు రేటు  అమాంతంగా పెరగడంతో ఇప్పుడు అవి  రూ, 25 నుంచి రూ. 30 వరకు పెంచి విక్రయిస్తారు.  ప్రస్తుతం  ఒక మోస్తరు సైజు నిమ్మకాయ ధర రూ. 5 లకు హోల్​ సేల్​ మార్కెట్లో ధర పలుకుతుందని వ్యాపారులు చెబుతున్నారు.  అదే పెద్ద సైజు నిమ్మకాయను రూ. 10 కి విక్రయిస్తున్నారు.  

సామాన్యుడి 'కిచెన్‌ బడ్జెట్‌'లో నిమ్మ చిచ్చు పెడుతోంది. ఎండకాలం కావడంతో డైట్‌ తప్పనిసరి లిస్ట్‌లో కనిపించే నిమ్మ.. బడ్జెట్‌ పరిధిని దాటించేస్తోంది. ధరలు ఎప్పుడు దిగుతాయో అని ఎదురు చూడడం వినియోగదారుల వంతు అవుతోంది. మార్కెట్‌లో దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. అయితే నిమ్మ ధరలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటోంది. ఇంతకు ముందులా ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేయలేకపోతున్నారు. 

వేసవి కాలం పెరగడంతో మార్కెట్‌లో నిమ్మకాయల వినియోగం కూడా పెరిగింది. దీంతో వీటి ధరలు పెరిగాయి. విశేషమేమిటంటే, కర్ణాటకలోని బెలగావి జిల్లాలో డిమాండ్ పెరగడంతో నిమ్మకాయ రిటైల్‌తో పాటు హోల్‌సేల్ మార్కెట్‌లోనూ ఖరీదైనది. దీని ధర 350 శాతం పెరిగింది. ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో నిమ్మకాయ ధర మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో, నిమ్మకాయ ధర పెరుగుదల బెలగావి వినియోగదారులపై విపరీతమైన ప్రభావం చూపిందని నిపుణులు అంటున్నారు. అతని వంటగది బడ్జెట్ నాశనం చేయబడింది.

కర్నాటక రాష్ట్రంలో అధికంగా నిమ్మ పంటను సాగు చేస్తారు.  విజయపురి జిల్లాలో ఈ ఏడాది నిమ్మ పంటను రైతులు  40 శాతం తక్కువుగా సాగు చేశారు. దీంతో మార్కెట్లో  నిమ్మకాయలు కొరత ఏర్పడింది. డిమాండుకు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో  నిమ్మకాయల ధర ఒక్కసారిగి ఆకాశాన్నిఅంటింది. నెల రోజుల క్రితం టోకుగా 1000 పెద్ద సైజు నిమ్మకాయలు రూ. 2 వేల పలకగా ... ఇప్పుడు అవే రూ. 7 వేలకు పైగా చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందని నిమ్మకాయల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అంటే హోల్​ సేల్​ మార్కెట్​ వ్యాపారులే 350 శాతం ఎక్కువ ధరతో కొనాల్సి వస్తుంది. 

ఎందుకిలా..

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల నిమ్మకాయల ఉత్పత్తి తగ్గిపోయిందని బెళగావి ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహంతేష్ ముర్గోడ్ తెలిపారు.   కర్ణాటకలో 22 వేల హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిమ్మ సాగు చేసి ఏడాదికి మూడు లక్షల టన్నులను ఉత్పత్తి చేపేవారు,  ఇందులో 60 శాతం  అంటే 12వేల 200 హెక్టార్లలో విజయపురి జిల్లాలో సాగు అయ్యేది.  తర్వాత కలబురగి, బాగల్‌కోట్ మరియు బెలగావి జిల్లాల్లో నిమ్మ సాగు చేస్తారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు నిమ్మకాయను సూరత్, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై మీదుగా విదేశాలకు ఎగుమతి చేస్తారు.ఈసారి కరువు వల్ల నిమ్మచెట్లకు పూలు రాలిపోయాయని, దీంతో దిగుబడి తగ్గిందని నిమ్మకాయల అభివృద్ధి మండలి మాజీ చైర్మన్ అశోక్ అల్లాపూర్  తెలిపారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో నిమ్మచెట్లను కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది.

అసలే వేసవి.. ఆపై ఉక్కపోత.. వడగాలులు.. దీని నుంచి తప్పించుకోవాలంటే చలువ పదార్థాలు తీసుకోవాలి. అంటే మజ్జిగ, నిమ్మరసం, పుచ్చకాయ లాంటివి అన్నమాట.. అవును ఇప్పుడు జ్యూస్ పాయింట్లు కూడా కనిపిస్తున్నాయి. అయితే నిమ్మకాయ చలువ.. అందుకే నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటారు. సమ్మర్‌లో దీనికి ఎక్కడ లేని డిమాండ్ కూడా.. సో ఇంకేముంది నిమ్మకాయ ధర పెరిగింది. హై అంటే మాములు కాదు.. ఏకంగా వారం రోజుల్లోనే 350 శాతం ధర పెరిగి ఆకాశాన్ని అంటుతుంది.