భానుడి భగభగ.. జనం విలవిల.. 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు..

భానుడి భగభగ.. జనం విలవిల.. 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు..

తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో టెంపరేచర్ పెరుగుతుంది. భానుడి భగభగకు జనం విలవిలలాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వాతావరణ శాఖ అప్రమత్తమై పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే ఐదు రోజులు వడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది.

 చాలా జిల్లాల్లో గరిష్టంగా 43 డ్రిగ్రీల నుంచి 45 డిగ్రీలు దాక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 దాటిపోతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్ జిల్లాలో భానుడి భగభగకి జనం బయటకు రావడానికే భయపడుతున్నారు.

 ఉదయం 11 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం7 గంటల దాక ఎండ పోకపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఎండ వేడికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.