హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో వేసవి వినోదాన్ని పంచేందుకు 'సమ్మర్ ఉత్సవ్ మేళా' అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేళాలో ప్రధాన ఆకర్షణ.. మొట్టమొదటిసారిగా మన భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన లైవ్ జలకన్యల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. ఫిలిప్పీన్స్‌కు చెందిన ప్రొఫెషనల్ స్విమ్మర్లు జలకన్యల వేషధారణలో భారీ అక్వేరియంలో చేస్తున్న ఫీట్లు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. సినీ నటుడు అలీ సతీమణి జుబేదా ఈ షోను ప్రారంభించారు.
ఈ మేళాలోకనువిందు చేసే ప్యారిస్ ఐఫిల్ టవర్ భారీ సెట్.. మనసును ఆహ్లాదపరిచే సెరియల్ వాటర్ ఫాల్, రాజసం ఉట్టిపడే రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజికల్ ప్యాలెస్ థీమ్స్, ఒకే వేదికపై ఇన్ని వింతలు, వినోదాలు కొలువుదీరడంతో నగరవాసులు భారీగా తరలివస్తున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ షో అందుబాటులో ఉంటుందని నిర్వాహకుడు రఫీక్ బేగ్ తెలిపారు.

