తెలంగాణలో వేసవి సెలవులు 20వరకు పొడిగింపు

తెలంగాణలో వేసవి సెలవులు 20వరకు పొడిగింపు

హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల పునః ప్రారంభంపై గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. వేసవి సెలవులు ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ప్రకటించిన మేరకు ఇవాళ్టితో వేసవి సెలవులు ముగుస్తున్న విషయ తెలిసిందే. రేపు పునః ప్రారంభిస్తారా.. లేదా ? అయితే ఎలా.. టైమింగ్స్ .. తదితర వివరాలపై అటు ప్రభుత్వం గాని లేదా పాఠశాల విద్యాశాఖ గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. 
విద్యార్థులేమో ఎలాగూ తెరవరు.. తెరచినా వెళ్లేది ఉండదన్న ధీమాతో ఉండగా.. టీచర్లు, సిబ్బంది మాత్రం స్పష్టత లేక తీవ్ర అయోమయంలో ఉన్నారు. ఇవాళ్టితో వేసవి సెలవులు ముగిసిన నేపధ్యంలో రేపు బుధవారం స్కూళ్లు తెరుస్తారా.. లేదా అన్నది ప్రభుత్వం సాయంత్రం వరకు ప్రకటించలేదు. దీనిపై గందరగోళంలో ఉన్న ఉపాధ్యాయులు అటు ప్రభుత్వ పెద్దలతోనూ.. పాఠశాల విద్యాశాఖ వద్ద.. మీడియాకు ఫోన్లు చేసి ఆరా తీస్తూ వచ్చారు. ఎట్టకేలకు వీరి నిరీక్షణకు తెరదించుతూ వేసవి సెలవులు ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.