Tillu square, The Family Star OTT: OTTకి వచ్చేసిన టిల్లు స్క్వైర్, ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Tillu square, The Family Star OTT: OTTకి వచ్చేసిన టిల్లు స్క్వైర్, ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఆడియన్స్ కు ఈవారం ఓటీటీలో సినిమాల జాతర సాగనుంది. వరుసగా క్రేజీ అండ్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఓటీటీకి వస్తున్నాయి. వాటిలో ఇప్పటికే సూపర్ హిట్ భీమా(Bhimaa), విజువల్ వండర్ గా వచ్చిన గామి(Gaami) సినిమాలు ఓటీటీకి వచ్చేయగా.. ఇప్పుడు మరో రెండు క్రేజీ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేశాయి. వాటిలో బ్లాక్ బస్టర్ ఫన్ ఎంటర్టైనర్ టిల్లు స్క్వైర్. విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫ్లిక్ ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఉన్నాయి.

ముందుగా టిల్లు స్క్వైర్ సినిమా విషయానికి వస్తే.. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈ సినిమాలు దర్శకుడు మల్లి రామ్ తెరకెక్కించాడు డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టింది ఈ మూవీ. కేవలం.. రూ.20 నుండి రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో ఏప్రిల్ 26 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో మిస్ అయ్యారా అయితే వెంటనే ఓటీటీలో చూసేయండి. 

ఇక విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే.. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా.. లేటెస్ట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి వచ్చింది. కానీ, సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. దాంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దాంతో ఈ సినిమాను అనుకున్నదాని కన్నా ముందుగానే ఓటీటీకి తీసుకొచ్చారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 26 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. మరి వీలుంటే వెంటనే ఓటీటీలో చూసేయండి.