
భారత దేశంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2021లో ఐటీ చట్టాన్ని సవరించింది. కొత్తగా వచ్చిన ఐటీ రూల్స్ – 2021లోని 4(2) నిబంధనను సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు కోర్టు విచారణలో గోప్యత పాటించకుంటే వాట్సాప్ భారత్ నుంచి వెళ్లిపోతుందని మెటా సంస్థ ఢిల్లీ హైకోర్టుకు చెప్పింది. ఏంటి ఈ కొత్త రూల్, ఎందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలను ఇబ్బంది పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏదైనా పోస్ట్ లేదా సమాచారం ఫస్ట్ ఎవరు పోస్ట్ చేశారనేది సోషల్ మీడియా సంస్థలు గుర్తించాలని 4(2) నిబంధన చెప్తున్నది. ఫేక్ కంటెంట్ ను పంపేవారిని నివారించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిబంధన పెట్టారు. అయితే, ఇలా చేయాలంటే కోట్లాది మెసేజ్‌లను ఏండ్ల తరబడి స్టోర్ చేయాల్సి ఉంటుందని వాట్సాప్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎండ్ టూ ఎండ్ ఎంక్రిప్షన్ విధానానికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. అంటే ఎక్కడా మెసేజ్ స్టోర్ కాకుండా నేరుగా సెండర్ నుంచి రిసీవర్ కు వెళ్తొంది. ఎండ్ టూ ఎండ్ ఎంక్రిప్షన్ వల్ల గోప్యత ఉంటుందనే నమ్మకంతోనే వినియోగదారులు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారని, దీనికి భంగం కలిగే పరిస్థితే వస్తే తమపై వినియోగదారుల నమ్మకం దెబ్బతింటుందని మెటా సంస్థ కోర్టుకు వివరించింది.