కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా(బీఈసీఐఎల్) క్లీనర్, కుక్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 07.
- పోస్టుల సంఖ్య: 09.
- పోస్టులు: మెస్ సూపర్వైజర్ 02, కుక్ 01, రోటి మేకర్ 01, వెయిటర్ 02, కిచెన్ హెల్పర్ 01, క్లీనర్ 02.
- ఎలిజిబిలిటీ
- మెస్ సూపర్వైజర్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- కుక్, రోటీ మేకర్, వెయిటర్, కిచెన్ హెల్పర్ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- క్లీనర్ పోస్టులకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎనిమిదో తరగతి పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
- వయోపరిమితి
- మెస్ సూపర్వైజర్: 18 నుంచి 40 ఏండ్లు ఉండాలి.
- కుక్, రోటి మేకర్, వెయిటర్, కిచెన్ హెల్పర్, క్లీనర్: 18 నుంచి 35 ఏండ్లు ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా. బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్), బీఈసీఐఎల్ భవన్, సి–56/ఏ–17, సెక్టార్–62, నోయిడా– 201307 చిరునామాకు పంపించాలి.
- అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 31.
- లాస్ట్ డేట్: నవంబర్ 07.
- అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.295.
- సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ/ అసెస్మెంట్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు becil.com వెబ్సైట్లో సంప్రదించగలరు.
