Hockey India: బీసీసీఐని పట్టించుకోని హాకీ ఇండియా.. పాక్ ప్లేయర్లకు టీమిండియా షేక్ హ్యాండ్

Hockey India: బీసీసీఐని పట్టించుకోని హాకీ ఇండియా.. పాక్ ప్లేయర్లకు టీమిండియా షేక్ హ్యాండ్

పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంలో బీసీసీఐని తాము ఫాలో అవ్వమని హాకీ ఇండియా క్లారిటీ ఇచ్చింది. భవిష్యత్తులో జరిగే అంతర్జాతీయ మ్యాచ్ లు, ఒలింపిక్ లాంటి బిగ్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ జట్టుతో భారత హాకీ ప్లేయర్లు  హ్యాండ్ షేక్ లేదా హై-ఫైవ్‌లను ఇస్తుంటే తాము అడ్డుకోమని హాకీ ఇండియా (HI) సోమవారం (నవంబర్ 3)స్పష్టం చేసింది. గత నెలలో మలేషియాలో జరిగిన సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ జరుగుతున్నప్పుడు భారత జూనియర్ హాకీ ఆటగాళ్ళు.. పాకిస్తాన్ ప్లేయర్స్ కు హై-ఫైవ్స్‌ ఇవ్వడంతో వివాదం నెలకొన్న తర్వాత హాకీ ఇండియా నుంచి ఈ వివరణ ఇచ్చింది. 

హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలా నాథ్ సింగ్ మాట్లాడుతూ.." రాబోయే మ్యాచ్‌లలో అసోసియేషన్ ఒలింపిక్ చార్టర్ అంతర్జాతీయ సమాఖ్య (FIH) సూత్రాలను అనుసరిస్తుంది. షేక్ హ్యాండ్ విషయంలో మేము క్రికెట్ ను ఫాలో అవ్వాలనుకోవడం లేదు. క్రికెటర్లు ఏమి చేసినా, అది వారి ఛాయస్. మేము ఒలింపిక్ చార్టర్, FIH చెప్పేదాన్ని ఫాలో అవుతాము. హాకీ ఇండియా నుంచి ప్లేయర్స్ పాకిస్థాన్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ తీసుకోవద్దు లాంటి సూచనలు లేవు. భవిష్యత్తులో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ ల్లో హాకీ ఇండియా తన ఆటగాళ్లకు ఎలాంటి దిశానిర్దేశం చేయదు. మేము ఆడి గెలవడంపై దృష్టి పెడతాము". అని నవంబర్ 7న భారత హాకీ 100 సంవత్సరాల వేడుకలకు ముందు జరిగిన కార్యక్రమంలో సింగ్ అన్నారు.

Also Read :  అన్యాయం జరిగిందా..? ప్రతీకకు విన్నింగ్ మెడల్ ఇవ్వలేదు

ఇటీవలే ముగిసిన ఆసియా కప్ లో ఇండియా- పాకిస్థాన్ జట్ల మధ్య షేక్ హ్యాండ్ వివాదం ఎంతలా చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిందే. దుబాయ్ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన మూడు మ్యాచ్ ల్లోనూ ఇండియా పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బీసీసీపై ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది. ఈ వివాదం ఆసియా కప్ తో ముగిసిందనుంకుంటే ఆ ఆతర్వాత భారత మహిళా జట్టు కూడా 2025 వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని బీసీసీఐ చెప్పింది. 

పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఇండియా, పాకిస్థాన్ జట్లు ఆసియా కప్ లో తలపడ్డాయి. దీంతో ఇరు జట్లు ఫార్మాలిటీగా మ్యాచ్ ఆడడానికి వచ్చామని చెప్పకనే చెప్పారు. మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ తో ఇండియా మ్యాచ్ ఆడకూడదని.. బాయ్ కాట్ చేయాలని దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఆడినప్పటికీ పాకిస్థాన్ తో టీమిండియా ఎలాంటి షేక్ హ్యాండ్స్ గానీ.. ఫోటో షూట్స్ గానీ ఇవ్వలేదు. పాకిస్థాన్ తో ఫైనల్ గెలిచిన తర్వాత కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా ప్లేయర్లు నిరాకరించారు.