Madras IIT: రన్ వే అవసరం లేని విమానాలు..!మద్రాస్ ఐఐటీ కొత్త టెక్నాలజీ ఆవిష్కరణ

Madras IIT: రన్ వే అవసరం లేని విమానాలు..!మద్రాస్ ఐఐటీ  కొత్త టెక్నాలజీ ఆవిష్కరణ

రన్​వే అవసరం లేని విమానాలు..! రాబోతున్నాయి..మీరు విన్నది నిజమే.. విమానాలు ఎగరాలన్నా, ల్యాండ్​ కావాలన్నా కిలోమీటర్ల రన్​ వే కావాల్సిందే.. ఇది మనందరికి తెలుసు.. అందుకే ప్రతి ఎయిర్ పోర్టులతో ప్రత్యేకంగా రన్​ వేలను ఏర్పాటు చేస్తారు. అయితే ఇకపై రన్​ వేలు లేకుండానే విమానాలను ల్యాండింగ్​ చేసే కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది. అది కూడా మన మద్రాస్​ ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు..

వర్చువల్​ టేకాఫ్ మరియు ల్యాండింగ్ (VTOL) విమానాలు అంటే రన్​ వే అవసరం లేకుండా నెమ్మదిగా  ల్యాండ్​ అయ్యే విమానాలకోసం హైబ్రిడ్ రాకెట్ థ్రస్టర్లతో కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో అడుగు ముందుకు వేశారు. 

రియల్-టైమ్ హైబ్రిడ్ రాకెట్ థ్రస్టర్​ ను వర్చువల్ సిమ్యులేషన్​ తో  కలిపిన ఓ లేటెస్ట్ ప్రయోగంలో సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అవసరమైన వేగాన్ని పరిశోధకులు సాధించారు. మానవరహిత లేదా మానవరహిత అన్వేషణ మాడ్యూల్ గ్రహ ల్యాండింగ్ నుంచి VTOL విమానం భూగోళ ల్యాండింగ్ వరకు అన్ని క్రాఫ్టులకు ఇది కీలకమైన లక్షణం.

Also Read : 27 శాతం పెరిగిన బజాజ్ ఫైనాన్స్లోన్లు

ఐఐటీ మద్రాస్​ తన పరిశోధన వివరాలను ఓ ఇంటర్నేషన్​ జర్నల్​ ప్రచురించింది. ఈ సిస్టమ్​ టెక్నికల్​ గా , కమర్షియల్​ గా ఉపయోగించగలిగితే ప్రపంచ వైమానిక రంగంలోనే గేమ్​ ఛేంజర్​ గా మారే అవకాశం ఉంది. ప్రయోగం సక్సెస్​ అయితే విమానాలను  కొండలపై, గుట్టలపై ఉన్న ప్రాంతాల్లో కూడా ఈజీగా ల్యాండింగ్ చేయొచ్చని మద్రాస్​ ఐఐటీ పరిశోధకులు చెబుతున్నారు.