27 శాతం పెరిగిన బజాజ్ ఫైనాన్స్లోన్లు

27 శాతం పెరిగిన బజాజ్ ఫైనాన్స్లోన్లు

న్యూఢిల్లీ: బజాజ్ ఫిన్​సర్వ్​లో భాగమైన బజాజ్ ఫైనాన్స్, పండుగ సీజన్‌‌లో వినియోగదారుల లోన్ల జారీలో రికార్డు నమోదు చేసింది. లోన్ వాల్యూమ్‌‌లో 27 శాతం, విలువలో 29 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 26 మధ్య కాలంలో బజాజ్ ఫైనాన్స్ సుమారు 63 లక్షల లోన్లు ఇచ్చింది. 

ఈ కాలంలో కంపెనీ 23 లక్షల కొత్త కస్టమర్లను చేర్చుకుంది. వీరిలో 52 శాతం మంది కొత్తగా అప్పులు తీసుకున్నవారు. జీఎస్​టీ, ఐటీ తగ్గింపు కొనుగోలు శక్తిని పెంచాయి.  చాలా మంది ప్రీమియం ఉత్పత్తులకు మారుతున్నట్లు కంపెనీ తెలిపింది. టీవీలు, ఏసీలపై జీఎస్​టీ తగ్గించడం వల్ల,  లోన్ల సగటు టికెట్ పరిమాణం 6 శాతం తగ్గింది.  

హై-ఎండ్ ఉత్పత్తులకు అప్​గ్రేడ్ అయ్యేందుకు వీలు కలిగింది.  బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఫైనాన్స్ అయిన మొత్తం టీవీలలో, 40-అంగుళాలు అంతకంటే ఎక్కువ స్క్రీన్ ఉన్న టీవీల వాటా ఈ ఏడాది 71 శాతానికి పెరిగింది.