ప్రతి ఎనిమిది ఓట్లకు ఒక ఫేక్ ఓటు.. హర్యానా ఎన్నికలపై రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబు

ప్రతి ఎనిమిది ఓట్లకు ఒక ఫేక్ ఓటు.. హర్యానా ఎన్నికలపై రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి బాంబు పేల్చారు. ఈసారి హైడ్రోజన్ బాంబు పేల్చుతామని చెబుతూ వస్తున్న ఆయన.. అన్నట్లుగానే బుధవారం (నవంబర్ 05) హర్యానా ఎన్నికలపై హైడ్రోజన్ బాంబు పేల్చారు. హర్యానాలో భారీ స్థాయిలో వోట్ చోరీ జరిగిందని సంచలన ఆధారాలను బయటపెట్టారు. హర్యానాలో మొత్తం 2 కోట్ల ఓటర్లు ఉంటే 25 లక్షల ఓట్లు చోరీ అయినట్లు సంచలన ఆరోపణలు చేశారు. 

హర్యానాలో 5 రకాలుగా ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు రాహుల్. డూప్లికేట్, ఇన్ వాలిడ్ ఓట్స్, బల్క్ ఓట్స్, ఫామ్ 6, ఫామ్ 7 పేరున ఐదు రకాలుగా బీజేపీ-ఎన్నికల సంఘం కలిసి ఓట్ చేరికి పాల్పడినట్లు ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 5 లక్షల 51 వేల 619 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని ఆయన అన్నారు. 

బ్రెజిల్ మోడల్కు 22 ఓట్లు:

హర్యానాలో ఒక్క ఫోటోతో ఒక్కో నియోజక వర్గంలో 100 ఓట్లు ఉన్నట్లు ఆరోపించారు రాహుల్. బ్రెజిల్ మహిళకు ఒకే నియోజకవర్గంలో 22 ఓట్లు ఉండటమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకే అసెంబ్లీ సెగ్మెంట్ లో 10 బూత్ లలో 22 ఓట్లు ఉన్నాయని అన్నారు. సీమా, స్వీటి, సరస్వతి, సుమన్, రష్మీ లాంటి పేర్లతో ఈ మోడల్ కు ఓట్లు ఉన్నాయని ఆధారాలను బయటపెట్టారు. 

హర్యానాలో భారీ స్థాయిలో ఓట్ల గల్లంతు జరిగిందన్నారు రాహుల్. ఆ ఎన్నికల్లో అన్ని సర్వేలు కాంగ్రెస్ అనుకూలంగా వచ్చాయని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయని.. అయినప్పటికీ ఫలితాలు తారుమారు చేశారని ఆరోపించారు. చివరికి 22 వేల779 ఓట్లతో ఓడిపోయామని చెప్పారు. 

హర్యానా ఎన్నికల్లో ఓట్ చోరీ పై ప్రెస్ మీట్ నిర్వహించిన రాహుల్.. అక్కడ మారు పేర్లతో ఒకే ఫోటోను యూజ్ చేసి ఓటర్ కార్డులు క్రియేట్ చేశారని అన్నారు. రాష్ట్రంలో మొత్తం డ్యూప్లికేట్ ఓటర్లు 5 లక్షల 21 వేల 619 మంది ఉన్నారని అన్నారు. తప్పుడు అడ్రస్ 93 వేల174 ఓట్లు ఉన్నట్లు చెప్పారు.