జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో సుడిగాలుల బీభత్సం సృష్టించాయి. లెంకలగడ్డలో ఒక్కసారిగా భారీ సుడిగాలులు వీచాయి. దీని ప్రభావంతో సుమారు కిలోమీటర్ల వ్యవధిలో అడవి ధ్వంసం అయ్యింది. వందల ఎకరాల్లో అడవిలోని చెట్లు, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. అడవిలోని భారీ వృక్ష్యాలు నేలకొరిగాయి. గతేడాది మేడారం అడవుల్లో సుడిగాలులు మాదిరిగా భారీ గాలులు వీచాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
2024 సెప్టెంబర్ 4న ములుగు జిల్లాలోని తాడ్వాయి ఫారెస్ట్ అడవుల్లో భారీ వర్షం వల్ల 200 హెక్టార్లలో 50 వేలకు పైగా చెట్లు కూలిపోయాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఒక్క గాలివానకే ఇంత పెద్ద నష్టం జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు అటవీశాఖ అధికారులు. ఈ రేంజ్ లో నష్టం వాటిల్లటం అదే తొలిసారి కావడం గమానాహర్ణం
