Dies Irae Trailer: ‘తీర్పునిచ్చే రోజు.. ఆకాశం, భూమి బూడిదవుతాయి’.. మోహన్‌లాల్‌ కుమారుడి తెలుగు హారర్ థ్రిల్లర్‌

Dies Irae Trailer: ‘తీర్పునిచ్చే రోజు.. ఆకాశం, భూమి బూడిదవుతాయి’.. మోహన్‌లాల్‌ కుమారుడి తెలుగు హారర్ థ్రిల్లర్‌

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకు, ప్రణవ్‌‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డీయస్‌ ఈరే’ (Dies Irae). మోహన్‌ లాల్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. భూత కాలం, మమ్ముట్టి ‘భ్రమ యుగం’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ సదాశివన్ దీనికి దర్శకుడు. 

గత వారం (అక్టోబర్ 31న) మలయాళ, తమిళ భాషల్లో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రణవ్ మోహన్ లాల్ తన కెరీర్-బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, రైటర్-డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఈ హారర్ థ్రిల్లర్‌ను ఫస్ట్ నుండి క్లైమాక్స్ వరకు ఆసక్తిరేపే ఉత్కంఠభరితమైన అంశాలతో తెరకెక్కించాడని రివ్యూస్ వచ్చాయి. 

ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతుండటం సినిమాకు కలిసొచ్చే అంశం. అందుకు తగ్గట్టుగానే అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసుకుని నవంబర్‌ 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇవాళ (నవంబర్ 5న) తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

మిస్టరీ హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన మూవీ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. హార్రర్, క్రైమ్ అంశాలతో సినిమాపై ఉత్కంఠ రేపుతోంది. ‘తీర్పునిచ్చే రోజు.. ఆకాశం, భూమి.. బూడిదవుతాయి.. లోకం కన్నీళ్లతో నిండుతుంది’ అంటూ ప్రణవ్‌ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ స్రవంతి మూవీస్‌‌ సంస్థ విడుదల చేస్తోంది.

Also Read :  కొత్త వెర్షన్లో ఓటీటీలోకి ‘మిత్ర మండలి

‘హృదయం’ చిత్రంతో యూత్‌‌ను ఆకట్టుకున్న ప్రణవ్‌‌ మోహన్‌‌ లాల్.. సెలక్టివ్‌‌గా సినిమాలు చేస్తున్నాడు. ప్రణవ్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో హారర్ థ్రిల్లర్‌తో ఆడియన్స్ ను అలరించడానికి వస్తున్నారు ప్రణవ్. అయితే, మలయాళ చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో దక్కుతున్న ఆదరణ నేపథ్యంలో ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్‌‌ చెబుతున్నారు.