ప్రియదర్శి, నిహారిక NM లీడ్ రోల్స్‌లో నటించిన రీసెంట్ ఫిల్మ్ ‘మిత్ర మండలి’(Mithra Mandali). ఇందులో ప్రియదర్శితో పాటుగా రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా కీలక పాత్రల్లో నటించారు. విజయేందర్ ఎస్ తెరకెక్కించిన ఈ కామెడీ డ్రామాని, బన్నీ వాస్ గ్రాండ్గా రిలీజ్ చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ‘మిత్ర మండలి’.. నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. లేటెస్టుగా హీరో ప్రియదర్శి ‘మిత్ర మండలి’ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ, పోస్ట్ పెట్టారు.
‘మిత్ర మండలి’ ఓటీటీ:
అక్టోబర్ 16న విడుదలైన ‘మిత్ర మండలి’ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో మేకర్స్ అంచనాలను పూర్తిగా రివర్స్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూసింది. దీంతో 20 రోజుల లోపే ఓటీటీ బాట పట్టింది. రేపు గురువారం (నవంబర్ 6) నుంచి మిత్రమండలి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రియదర్శి అధికారికంగా ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు.
అయితే, మిత్ర మండలి ఓటీటీలోకి మరింత ఖచ్చితమైన కొత్త కంటెంట్తో తీసుకొస్తున్నాం అంటూ ప్రియదర్శి ట్వీట్ చేశారు. ‘‘మేము నవ్వుకున్నాము, నేర్చుకున్నాము, తిరిగి కత్తిరించాము. మిత్రమండలి కొత్త వెర్షన్‌ను ఓటీటీలోకి తీసుకొస్తున్నాం. ఈసారి, మరింత సరదాగా నవ్వుకునేలా ప్రైమ్ వీడియోలో నవంబర్ 6 నుండి వస్తున్నాం’’ అని ప్రియదర్శి X వేదికగా తెలిపారు.
We laughed, we learnt, we recut 😅#MithraMandali gets a brand new version. This time, sharper and lot funnier…
— Priyadarshi Pulikonda (@Preyadarshe) November 5, 2025
Here’s our heart once again on @PrimeVideoIN from November 6 @JustNiharikaNm @smayurk @IamVishnuOi #PrasadBehara @vennelakishore #Satya @TheBunnyVas… pic.twitter.com/1gFMCL1UcO
నిర్మాత బన్నీ వాసు సినిమాపై మంచి పాజిటివ్ పెంచేలా ప్రమోషన్స్లో మాట్లాడారు. ప్రతి సీన్ బాగా నవ్విస్తుందని చెప్పడంతో, అందరూ అలెర్ట్ అయ్యారు. కానీ, థియేటర్లో విడుదలయ్యాక.. సీన్ రివర్స్ అయింది. ఈ క్రమంలో మిత్ర మండలి మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అందువల్ల సినిమా కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతుంది.
అయితే, ఈ మూవీకి పోటీగా సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా, కిరణ్ అబ్బవరం K-Ramp, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని సాధించాయి. 'తెలుసు కదా' నవంబర్ 13 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
కథేంటంటే:
ఇదొక జంగ్లీపట్నానికి చెందిన నలుగురు కుర్రాళ్ల కథ. వీరి గురించి ఊరి భాషలో చెప్పాలంటే .. పనిలేని పోరంబోకులు. బ్యాట్ అండ్ బాల్ లేకుండానే క్రికెట్ ఆడుతారు. బ్యాట్ లేకుండానే సిక్స్‌లు కొట్టడం, బాల్ లేకుండా వికెట్లు తీయడం వంటి స్కీన్లతో.. వీరి ఎంట్రీతోనే క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. ఇంతకు వారెవరో చెప్పలేదు కదా.. వారే ఈ నలుగురు ఉద్దండులు. చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు ఓ.ఐ), రాజీవ్ (ప్రసాద్). ఈ కుర్రాళ్ల మధ్యలో కులపిచ్చి ఉన్న ఓ పొలిటిషన్ నారాయణ (వీటీవీ గణేశ్). చచ్చేటప్పుడు కూడా వేరే కులపొడి రక్తం కూడా ఎక్కించుకోడు. అలాంటి పట్టింపులతో జీవిస్తాడు. ఇతని కూతురు పేరు స్వేచ్ఛ (నిహారిక).
►ALSO READ | అవార్డులకు మేం పనికిరామా.? ప్రకాష్ రాజ్ను నిలదీసిన చైల్డ్ ఆర్టిస్ట్.. ఒక్క పోస్ట్తో ఇండస్ట్రీ షేక్
కులానికి ప్రాణమిచ్చే నారాయణ.. వారి తొట్టె కులం ఓట్లతోనే ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే నలుగురు పోరంబోకుల్లో.. ఇద్దరు సాత్విక్, అభి.. స్వేచ్ఛ (నిహారిక NM)ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంతలోనే స్వేచ్ఛ ఇంటి నుంచి పారిపోతుంది. కానీ, సాత్విక్, అభితో కాదు. వేరే మూడో వ్యక్తితో. ఈ విషయం నారాయణకు తెలిసాక.. బయట జనాలకు తెలిస్తే పరువు పోతుందని భావిస్తాడు. ఈ క్రమంలో తన కూతురు కిడ్నాప్ అయ్యిందంటూ ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్) ని రంగంలోకి దింపుతాడు.
ఇంతకీ.. నిహారిక ఎవరితో పారిపోయింది? కులం కోసం ప్రాణమిచ్చే నారాయణ, వేరేకులపొడితో వెళ్లిన కూతురిని ఏం చేశాడు? స్వేచ్ఛ కారణంగా ఈ నలుగురి కుర్రాళ్ల లైఫ్ ఎలా మారిపోయింది? తిరిగి నారాయణ తన కూతురిని తెచ్చుకున్నాడా? లేదా అనేది మూవీ మిగతా కథ.
