అవార్డులకు మేం పనికిరామా.? ప్రకాష్ రాజ్ను నిలదీసిన చైల్డ్ ఆర్టిస్ట్.. ఒక్క పోస్ట్తో ఇండస్ట్రీ షేక్

అవార్డులకు మేం పనికిరామా.? ప్రకాష్ రాజ్ను నిలదీసిన చైల్డ్ ఆర్టిస్ట్.. ఒక్క పోస్ట్తో ఇండస్ట్రీ షేక్

55వ కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం (2025 నవంబర్ 3న) ఈ అవార్డులను ప్రకటించారు. కేరళ ఫిల్మ్ అవార్డుల్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరోసారి బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల చైర్‌పర్సన్గా.. నటుడు ప్రకాష్ రాజ్ వ్యవహరిస్తున్నారు.

అయితే, అవార్డుల వేదికపై ‘‘మమ్ముట్టికి జాతీయ గుర్తింపు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ అవార్డుల ప్రక్రియ యొక్క సమగ్రతను ఆయన ప్రశ్నించారు. జాతీయ అవార్డులు రాజీ పడ్డాయని చెప్పడానికి నాకు అభ్యంతరం లేదని ’’ అన్నారు.

ఈ క్రమంలోనే చైర్‌పర్సన్గా ఉన్న ప్రకాష్ రాజ్పై మలయాళ చిత్ర చైల్డ్ ఆర్టిస్ట్, ఉన్ని ముకుందన్ 'మలికప్పురం' మూవీలో నటించిన దేవానంద జిబిన్ (Devanandha Jibin) విరుచుకుపడింది. వయసులో చిన్న అమ్మాయే అయిన, కళ్లు మూసుకున్న జ్యురీ మెంబెర్స్కి క్లాస్ పీకింది.

సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ మాట్లాడిన వీడియో షేర్ చేస్తూ.. తనదైన శైలిలో ప్రశ్నిస్తూ కడిగిపారేసింది. కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డుల్లో బాల నటులకు ఒక్క అవార్డు కూడా ఇవ్వకపోవడం, ఆ స్థాయి సినిమాలు, నటులేవీ తమకు కనిపించలేదని ప్రకాష్ రాజ్ అనడంపై చైల్డ్ ఆర్టిస్ట్ దేవానంద అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, తాను పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

►ALSO READ | PEDDI Chikiri Song: ‘పెద్ది’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ‘చికిరి’ అంటే అర్ధం చెప్పేసిన బుచ్చిబాబు

“మీరు బాల నటులను చూసీచూడనట్లు వ్యవహరించి ఉండొచ్చు. కానీ ఇక్కడంతా చీకటే అని చెప్పకండి. పిల్లలు కూడా సమాజంలో భాగమే అని చెప్పిన మీరే.. ఈ అవార్డుల్లో వాళ్లను చూసీ చూడనట్లు వదిలేశారు. ఈ అవార్డుల ప్రకటనతో జ్యూరీ తదుపరి తరాన్ని చూసి కళ్ళు మూసుకుంది. నిజానికి 'స్థానార్థి శ్రీకుట్టన్', 'గు', 'ఫీనిక్స్', 'ARM' వంటి ఎన్నో సినిమాల్లో బాల నటీనటులు అద్భుతంగా నటించారు. వారిలో కనీసం.. ఓ ఇద్దరు పిల్లలకైన అవార్డులు ఇచ్చి ఉంటే అది ఎంతో మంది రాబోయే చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు పెద్ద ప్రోత్సాహం, శక్తిగా మారేది. బాల నటులకు మరిన్ని సినిమా అవకాశాలు రావాలని, వారు కూడా సమాజంలో భాగమేనని స్వయంగా చెప్పిన జ్యూరీ చైర్మన్.. తీరా అవార్డుల ప్రకటనలో మాత్రం బాలల హక్కులను పూర్తిగా విస్మరించడం నాకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.

ఈ అంశంపై సమాజంలో ఉన్న అన్ని మీడియా వర్గాలు, సినీ కార్మికులు, మరియు సాధారణ ప్రజలు కూడా ఈ విషయంపై చర్చించాలి. బాల నటుల హక్కుల కోసం పోరాడాలి. మార్పులతో పాటు హక్కులను కూడా రక్షించాలి. ఇది రాబోయే తరాలకు ఎంతైనా అవసరం ఉంది” అని చైల్డ్ ఆర్టిస్ట్ దేవానంద పోస్ట్ ద్వారా వెల్లడించింది.

అవార్డుల జాబితా: 

'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా అవార్డుల ప్యానెల్‌లో ఈసారి సంచలనం సృష్టించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడి అవార్డులతో పాటుగా పలు విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. 

ఉత్తమ చిత్రం- మంజుమ్మెల్ బాయ్స్

ఉత్తమ ద్వితీయ చిత్రం - ఫెమినిచి ఫాతిమా

ఉత్తమ నటుడు- మమ్ముట్టి (భ్రమయుగం)

 ఉత్తమ నటి- (షమ్లా హంజా)

ఉత్తమ సహాయ నటుడు: సౌబిన్ షాహిర్ (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ సహాయ నటి: లిజోమోల్ జోస్ (నాదన్న సంభవం)

ఉత్తమ నటుడిగా స్పెషల్ జ్యూరీ మెన్షన్- టొవినో థామస్ (ARM)

ఉత్తమ నటిగా స్పెషల్ జ్యూరీ మెన్షన్- దర్శన రాజేంద్రన్- ప్యారడైస్ 

ఉత్తమ తొలి దర్శకుడు: ఫాజిల్ మహ్మద్- (ఫెమినిచి ఫాతిమా)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (DOP): షైజు ఖలీద్

ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్ (ఒరిజినల్): చిదంబరం

ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: అజయన్ చాలస్సేరి

ఉత్తమ సౌండ్ డిజైన్: షిబిన్ మెల్విన్, అభిషేక్ నాయర్

 ఉత్తమ సంగీత దర్శకుడు: సుషిన్ శ్యామ్- బౌగేన్విల్లా

ఉత్తమ లిరిసిస్ట్: వేదన్ (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ప్రేమలు

బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ (సయనోరా ఫిలిప్, భాసి వైకోమ్)- బరోజ్