ఇండియన్ సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ టాలీవుడ్ మూవీ ‘పెద్ది’ (PEDDI). హీరో రామ్ చరణ్ నటిస్తున్న ఈ రూరల్ పీరియాడిక్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం పెద్ది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా పెద్ది నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్.
పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు వారం రోజులుగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా, గత రెండ్రోజులుగా పెద్ది మేకర్స్ ‘చికిరి..చికిరి’ అనే పదాన్ని బాగా వైరల్ చేస్తున్నారు. దీంతో ‘చికిరి’ అనే పదంతో సాంగ్ ఉండబోతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
ఈ క్రమంలోనే ‘చికిరి’ అంటే ఏంటనేది అర్ధం చెప్పేసారు డైరెక్టర్ బుచ్చిబాబు. ‘‘కొండల్లో ఎక్కడో ఉన్న పెద్దిగాడు.. ఫస్ట్ టైం హీరోయిన్ చూస్తాడు.. అలా చూసిన వెంటనే, థన్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ.. " కాటుక అక్కర్లేని ఆ కళ్ళు, ముక్కుపుడక అక్కర్లేని ఆ ముక్కు, అలంకరణ అక్కర్లేని అరుదైన ' చికిరి" రా ఈ 'చికిరి'. అలా విలేజ్లో బాగా ఇష్టపడ్డ అమ్మాయిని.. అందంగా, ముద్దుగా, ప్రేమగా చికిరి అని పిలుచుకుంటారని’’ బుచ్చిబాబు లోతైన అర్ధం చెప్పేసారు.
ఈ సందర్భంగా పెద్ది ఫస్ట్ సింగిల్గా లవ్ మెలోడీ ‘చికిరి.. చికిరి’ రాబోతోందని బుచ్చిబాబు తెలిపారు. ఆస్కార్ దిగ్గజం ఏఆర్ రెహమాన్ తనదైన శైలిలో ట్యూన్ ఇచ్చాడని, ఈ ప్రోమో చివర్లో తెలిసిపోయింది. ఇక ఈ చికిరి ఫుల్ సాంగ్ నవంబర్ 7న రీలిజ్ కానుంది.
What is #CHIKIRI?@BuchiBabuSana & @arrahman garu reveal it & don't miss the surprise at the end 🎵
— Ram Charan (@AlwaysRamCharan) November 5, 2025
▶️ https://t.co/nbcgt8O9b0#ChikiriChikiri
An @arrahman musical 🎼
Sung by @_MohitChauhan 🎙️
Full song on NOV 7th.#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/PllFymKEl4
ఈ పాటకు ఎఆర్ రెహమాన్ స్వరాలూ సమకూర్చగా, సింగర్ మోహిత్ చౌహాన్ పాడారు. జానీ మాస్టర్ కోరియోగ్రఫీ అందించారు. ఈ ప్రోమోలో చరణ్ సిగ్నేచర్ స్టెప్స్ అదిరిపోయాయి. ఈ క్రేజీ టాక్తో మెగా ఫ్యాన్స్ తమ మ్యూజిక్ బాక్సులను సిద్ధం చేసే పనిలోపడ్డారు. ఎందుకంటే, ఫస్ట్ గ్లింప్స్ తోనే పెద్ది మ్యూజిక్ స్థాయి ఎలా ఉండనుందో క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో రూరల్ బ్యాక్ డ్రాప్లో లవ్ మెలోడీ అంటే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి! పెద్ది మూవీలో అందాల భామ జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' రోల్లో కని పించనుంది. శివ రాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రజెంటర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది మూవీ 27 మార్చి 2026న థియేటర్లలో విడుదల కానుంది.
