చిన్న రంధ్రం..పెద్ద గందరగోళం..ఓ మహిళ కుర్చి రంధ్రంలో ఎలా వేలు పెట్టిందో తెలియదుగానీ.. పెద్ద దుమారం రేపింది.. చూసిన వారందరూ నవ్వుకునేలా చేసింది.. ఇక తన వేలును విరగకుండా కాపాడాలని ఏకంగా ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయడం మరో హాస్యాస్పదమైన విషయం. ఈ సంఘటన మొత్తానికి సంబంధించిన వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..
మలేషియాలో ఓ మహిళ వేలు ప్లాస్టిక్ కుర్చిలో చిన్న రంధ్రంలో ఇరుక్కుపోవడంతో ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సాయం కావాలని కోరింది.. ఈ హాస్యాస్పదమైన సంఘటన కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లను కాసేపు నవ్వుకునేలా చేసింది.
ఈ వీడియోను @Friends of Bomba Malaysia అనే సంస్థ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది.ఈ ఘటన నవంబర్ 1 న జరిగిందట. మహిళ కుడివైపు చేతి చిటికెన వేలు ప్లాస్టిక్ కుర్చిపై ఉన్న చిన్న రంధ్రంలో చిక్కుకుంది.విడిపించుకునేందుకు మహిళ ప్రయత్నం చేసినప్పటికీ ఎంతకీ వేలు బయటికి రాకపోవడంతో కొంచెం కంగారు, కొంచెం భయంతో వణికిపోయింది.. ఇక చేసేదేమీ లేక చివరికి ఫైర్ సిబ్బంది కి ఫోన్ చేసింది.
రెస్క్యూ టీం అక్కడికి చేరుకొని ప్రత్యేకమైన కట్టింగ్ టూల్స్ తో మహిళకు గాయం కాకుండా కుర్చిని కట్ చేసి జాగ్రత్తంగా వేలును బయటికి తీశారు. ఈ రెస్క్యూ వీడియో సోషల్ మీడియా బాగా వైరల్ అయింది. ఆన్ లైన్ వేలాది మంది చూశారు. ఫన్నీ కామెంట్స్ పెట్టారు. సరదాగా నవ్వుకున్నారు. ఆ మహిళ వేలు సురక్షితంగా బయటకు తీసినప్పటికీ ఈ సంఘటన అన్ని ప్లాట్‌ఫాంలలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.
