84 ఏండ్ల వృద్ధురాలికి  క్లిష్టమైన వెన్నెముక సర్జరీ సక్సెస్

84 ఏండ్ల వృద్ధురాలికి  క్లిష్టమైన వెన్నెముక సర్జరీ సక్సెస్
  • సికింద్రాబాద్ మెడికవర్ డాక్టర్ల ఘనత

పద్మారావునగర్, వెలుగు: మహబూబాబాద్​కు చెందిన 84 ఏండ్ల సుజాత అనే వృద్ధురాలికి సికింద్రాబాద్​సంగీత్ చౌరస్తాలోని మెడికవర్ డాక్టర్లు అత్యంత క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత పదేండ్లుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతూ ఇటీవల పూర్తిగా మంచానికే పరిమితమైన ఆమెకు.. పరీక్షల్లో ‘స్పైనల్ కెనాల్ స్టెనోసిస్’, వెన్నెముక క్షీణత ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.

సీనియర్ స్పైన్ సర్జన్ డాక్టర్ రమేశ్ నేతృత్వంలోని బృందం లంబార్ డికంప్రెషన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేయడంతో ప్రస్తుతం ఆమె నొప్పి లేకుండా ఆరోగ్యంగా నడుస్తున్నారు. వృద్ధాప్యంలో కూడా సరైన వైద్య పరీక్షలు, నిపుణుల పర్యవేక్షణ ఉంటే శస్త్రచికిత్సలు సురక్షితమని డాక్టర్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ సలాడి, డాక్టర్ ప్రదీప్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.