కూకట్పల్లి, వెలుగు: బీఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థులను డిటైన్ చేస్తూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జేఎన్టీయూలో స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం ఆందోళన నిర్వహించారు. 2023 ప్రొసీడింగ్స్ నిబంధనలను నాలుగో సంవత్సరం విద్యార్థులకు కూడా వర్తింపజేసి వారిని ప్రమోట్ చేయాలని ఫోరం నాయకులు జవ్వాజి దిలీప్, రాహుల్ నాయక్ డిమాండ్ చేశారు.
వందలాది మంది విద్యార్థులను డిటైన్ చేస్తూ 2025లో విడుదల చేసిన సర్క్యులర్‌ను రద్దు చేయాలన్నారు. అసలు క్రెడిట్స్ లేనప్పుడు నాలుగో సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలకు హాల్ టికెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ నిరసనలో సాగర్, రాజ్ కుమార్, వసంత్, వరుణ్, రాబిన్, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
