హైదరాబాద్, వెలుగు: ఓ మహిళ ఛాతీలో ఏర్పడిన భారీ కణితిని హైదరాబాద్విద్యానగర్ లోని దుర్గాబాయి దేశ్ ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన 36 ఏండ్ల మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించగా.. కుడి ఛాతీలో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు.
ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఈ చికిత్స అత్యంత క్లిష్టమైనదిగా, ఖరీదైనదిగా చెప్పడంతో బాధితులు రెనోవాను ఆశ్రయించారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న మెడికల్ డైరెక్టర్ డాక్టర్యు.ఆజాద్ చంద్రశేఖర్ నేతృత్వంలోని వైద్య బృందం సుమారు 10 గంటల పాటు శ్రమించి అత్యాధునిక విధానంలో సర్జరీ చేశారు. గుండె, ఊపిరితిత్తులకు హాని కలగకుండా కణితిని విజయవంతంగా తొలగించారు.
