ఏటీఎం అనగానే అందరికీ గుర్తుకొచ్చే డెబిట్ కార్డ్. కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. కార్డు ఇంట్లో మర్చిపోయి వెళ్లి డబ్బు కోసం ఇబ్బందులు పడ్డ రోజులు పోయాయ్. ప్రస్తుతం దేశంలో ప్రజలకు యూపీఐ సేవల అందిస్తున్న సౌకర్యం తర్వాత ఏటీఎంలు కూడా మరింత సౌకర్యవంతమైన సేవలను ఆఫర్ చేయటానికి సిద్ధం అవుతున్నాయి. దీనికోసం బ్యాంకింగ్ సంస్థలు తమ ఏటీఎం మెషిన్లను అప్ గ్రేడ్ చేస్తున్నాయి.
బ్యాంకింగ్ కంపెనీలు తీసుకొస్తున్న మార్పుల ద్వారా ప్రజలు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా నేరుగా ఏటీఎంల నుంచే డబ్బు తీసుకునేందుకు వీలు కల్పించబడుతోంది. దీనిని ఇంటర్ ఆపరబుల్ కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రా అని పిలుస్తారు. ఇవి కార్డుతో చేసే విత్ డ్రా కంటే వేగంగా సురక్షితంగా ఉంటాయని తెలుస్తోంది. ఇక్కడ ఎలాంటి కార్డ్, పిన్ వాడకుండానే క్యాష్ విత్ డ్రా చేయెుచ్చు. దీనికోసం యూజర్లు ఏటీఎం మెషిన్లలో “UPI Cash Withdrawal” ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది.
యూపీఐ క్యాష్ విత్ డ్రా ఎంచుకోగానే స్కీన్ మీద క్యూఆర్ కోడ్ వస్తుందని దానిని మీ ఫోన్ లోని యూపీఐ చెల్లింపుల యాప్ ద్వారా స్కాన్ చేయాలి. ఆ తర్వాత బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన యూపీఐ ఐడీ ఎంచుకుని అథెంటికేషన్ ద్వారా ట్రాన్సాక్షన్ ఫోన్ లోనే పిన్ ఎంటర్ చేయటం ద్వారా పూర్తవుతుంది. ట్రాన్సాక్షన్ కన్ఫమ్ అవ్వగానే ఏటీఎం క్యాష్ డిస్‌ప్యాచ్ చేసేస్తుంది. ఇలా ఒక్క ట్రాన్సాక్షన్ ద్వారా రూ.10వేలు డ్రా చేసేందుకు వీలు కల్పించబడుతోంది.
ప్రస్తుతాని ఈ కొత్త యూపీఐ క్యాష్ విత్ డ్రా ఫెసిలిటీ కొన్ని ఏటీఎంలలో మాత్రమే అందుబాటులో ఉంచబడింది. త్వరలోనే దీనికి అనుకూలంగా ఇతర మెషిన్లను బ్యాంకులు అప్ గ్రేడ్ చేస్తున్నాయి. ఈ కొత్త ఫీచర్ ద్వారా కార్డ్ క్లోనింగ్, కార్డ్ పోవటంతో వచ్చే నష్టాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
