భూకబ్జాదారులతో దోస్తీ..100కోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన డీఎస్పీ..చివరికి ఇలా

భూకబ్జాదారులతో దోస్తీ..100కోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన డీఎస్పీ..చివరికి ఇలా

భూకబ్జాదారులతో దోస్తీ..సెటిల్మెంట్లు.. దోపిడీ, భూ కబ్జా ,తప్పుడు కేసులు బనాయించడం అతని పని.. ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయికి ఎదిగినా.. అన్ని అవినీతి పనులే.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడం ద్వారా నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు ఓ కంపెనీ కూడా.. వందల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలతో సస్పెండ్ అయిన ఉత్తరప్రదేశ్​ కు చెందిన డీఎస్సీ బాగోతం ఇంది.వివరాల్లోకి వెళితే.. 

యూపీలోని మెయిన్‌పురి జిల్లాలోని భోగావ్‌లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్‌పి) శుక్లాని  రూ. 100 కోట్లకు పైగా విలువైన బినామీ ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలతో సస్పెండ్ చేశారు. కాన్పూర్‌కు చెందిన న్యాయవాది అఖిలేష్ దూబేకేసును సిట్​ అధికారులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత రిషికాంత్​ శుక్లా ను సస్పెండ్ చేశారు. దుబే కు అతని ముఠాతో  రిషికాంత్ శుక్లా చేతులు కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

దూబే కేసులో శుక్లా ఇంట్లో సోదాలు నిర్వహించిన సిట్​.. మొత్తం 12 రకాల ఆస్తులను కనుగొంది.. వీటిలో 92కోట్ల మార్కెట్​ విలువ ఉన్న ఆస్తులకు ఆధారాలు సంపాదించింది..  మరో మూడు ఆస్తులకు డాక్యుమెంట్లు లేకుండగా.. అతని పాన్​ నంబర్​ ఆధారంగా వాటిని గుర్తించారు.  

రిషికాంత్ శుక్లా..  1998నుంచి 2009 వరకు కాన్పూర్​లో పనిచేశారు. ఆ సమయంలో లాయర్ అఖిలేష్​ దూబే, అతని ముఠాకు సన్నిహితంగా ఉంటూ దోపిడీ, భూకబ్జా, తప్పులు కేసులు బనాయించడం వంటి అవినీతి పనులు చేసినట్లు శుక్లాపై ఆరోపణలు ఉన్నాయి. 

కాన్పూర్‌లో పనిచేసిన టైంలో దుబే అవినీతి అక్రమాలకు సహకరించారని, జిల్లాలకు బదిలీ అయిన తర్వాత కూడా కోట్లాది రూపాయల భూ ఒప్పందాలలో దుబేతో కలిసి రిషికాంత్ శుక్లా పనిచేశారని సిట్​ అధికారులు ఆరోపించారు.