ప్రభుత్వ టెలికం ఆపరేటర్BSNL దాని కస్టమర్లకు షాకిచ్చింది.. రీచార్జ్ ప్లాన్లు మరింత భారంకానున్నాయి. రీచార్జ్ ప్లాన్లలో నిశ్శబ్దంగా మార్పులు చేస్తోంది. లోకాస్ట్ రీచార్జ్ ప్లాన్ల వ్యాలిడిటీని తగ్గించింది. దీంతో మిలియన్ల కొద్ది యూజర్లపై భారం పడనుంది. ఈ తగ్గింపులు వోచర్లు, డేటా, SMS ప్రయోజనాలను కూడా మారుస్తాయి.
BSNL దాని ఫేమస్లోకాస్ట్ రీచార్జ్ ప్లాన్లలో ఎనిమిదింటి వ్యాలిడిటీ చడిచప్పుడు కాకుండా తగ్గిస్తోంది.. వ్యాలిడిటీ తగ్గితే తక్కువ టైం రీచార్జ్ చేసుకోవాల్సి రావడంతో యూజర్లపై మరింత భారపడనుంది.
వ్యాలిడిటీ తగ్గించబడిన ప్లాన్లు ఇవే..
రూ.1,499 ప్లాన్..
- వ్యాలిడిటీ లో 36 రోజులు తగ్గించారు. గతంలో 336 రోజులుండగా.. వ్యాలిడిటీ తగ్గించిన తర్వాత 300 రోజులు గా ఉంది.
- ప్రయోజనాలు: అన్ లిమిటెడ్ కాలింగ్, ఉచిత నేషనల్ రోమింగ్.అయితే ఈ ప్లాన్ డేటా ను 24GB నుంచి 32GB కి పెంచారు.
రూ. 997 ప్లాన్..
ఈప్లాన్ లో 10 రోజుల వ్యాలిడిటీని తగ్గించారు. గతంలో 160 రోజుల వ్యాలిడిటీ ఉండగా..ఇప్పుడు 150 రోజులు మాత్రమే వస్తుంది.
బెనిఫిట్స్..రోజుకు 2GB డేటా,100 ఉచిత SMSలు. రోజువారీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40Kbpsకి పడిపోతుంది.
రూ. 897 ప్లాన్..
రూ. 897 ప్లాన్ వ్యాలిడిటీని 15రోజులు తగ్గించారు. గతంలో 180 రోజుల వ్యాలిడిటీ ఉండగా.. ప్రస్తుతం 165 రోజులు మాత్రమే పనిచేస్తుంది.
బెనిఫిట్స్.. అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ SMSలు. డేటా ను 90GB నుంచి 24GBకి తగ్గించారు.
రూ. 599 ప్లాన్..
రూ. 599 ప్లాన్ లో వ్యాలిడిటీని 14 రోజులు తగ్గించారు. గతంలో 84 రోజుల వ్యాలిడిటీ ఉండగా..ప్రస్తుతం 70 రోజులు మాత్రమే ఈ ప్లాన్ పనిచేస్తుంది.
బెనిఫిట్స్..రోజుకు 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత SMSలు.
రూ.439 ప్లాన్..
వ్యాలిడిటీ 10 రోజులు తగ్గించారు. గతంలో 90 రోజులు ఉండగాప్రస్తుతం 80 రోజులు మాత్రమే.
బెనిఫిట్స్.. అన్ లిమిటెడ్ కాల్స్, 300 ఉచిత SMSలు.
రూ.319 ప్లాన్..
5 రోజుల వ్యాలిడిటీ తగ్గించారు. పాతది 65 రోజులుండగా కొత్త వ్యాలిడిటీ 60 రోజులు)
బినిఫిట్స్.. 10GB డేటా,300 ఉచిత SMSలు.
రూ.197 ప్లాన్..
వ్యాలిడిటీ 6 రోజులు తగ్గింది. పాతది వ్యాలిడిటీ 54 రోజులుకాగా.. కొత్తది 48 రోజులు
బెనిఫిట్స్.. 4GB డేటా, 100 ఉచిత SMSలు.
